ఖతార్ ను వణికించేస్తున్న చలిగాలులు: 10 డిగ్రీల సెల్సియస్ దిగువకు టెంపరేచర్
- January 14, 2020దోహా:ఖతార్ ను చలిగాలలు వణికించేస్తున్నాయి. వింటర్ వెదర్ కు వర్షాలు కూడా తోడవటంతో పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది. మరికొద్ది రోజుల పాటు వెదర్ ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ఖతార్ మెట్రలాజీ డిపార్ట్మెంట్ తెలిపింది. రేపటి నుంచి అకాశం మరింత మేఘావృతం కానుందని, దాంతో రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో టెంపరేచర్ 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. రేపు పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నట్లు మెట్రలాజీ డిపార్మెంట్ అధికారులు చెబుతున్నారు. సముద్ర తీరాల్లో రేపటి వరకు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతాయని, ప్రజలు ఎవరూ సముద్ర తీరానికి వెళ్లకపోవటమే మంచిదని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?