పోలవరం ప్రాజెక్టుపై పూర్తి సమాచారం కోరిన సుప్రీంకోర్టు
- January 14, 2020
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన స్టేటస్ రిపోర్టు, నిర్మాణ చిత్రాల పూర్తి సమాచారాన్ని అందజేయాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఒడిశా తరపు న్యాయవాది సుప్రీకోర్టుకు తన వాదనలు వినిపిస్తూ.. బచావత్ అవార్డుకు బిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చారని, ప్రాజెక్టు ముంపుపై కనీస అధ్యయనం కూడా చేయలేదని పేర్కొన్నారు. అయితే ప్రాజెక్టుపై తమకెలాంటి అభ్యంతరాలు లేవని కానీ మణుగూరు ప్లాంట్, గిరిజనులకు ముంపు నష్టం లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలో కోరింది. కాగా రెండు వారాల్లోగా పోలవరం నిర్మాణానికి సంబంధించిన సమాచారం అందజేస్తామని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. అనంతరం కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







