శ్రీలంకలో ఏడుగురు భారతీయులు అరెస్టు
- January 14, 2020
కొలంబో : వీసా గడువు ముగిసినా తమ దేశంలో ఉన్నారన్న ఆరోపణలపై ఏడుగురు భారతీయులను శ్రీలంక ఎమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారని మీడియా వర్గాలు తెలిపాయి. వట్టాలాలో ప్రముఖ నిర్మాణ స్థలంలో కార్మికులుగా పనిచేస్తున్న ఏడుగురు భారతీయులు వీసా గడువు తీరినప్పటికీ, అక్రమంగా నివసిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్, ఎమ్మిగ్రేషన్ శాఖ దర్యాప్తు సంస్థ గుర్తించింది. నెల రోజుల బిజినెస్ ట్రిప్ అని శ్రీలంకకు చేరుకుని గడువు దాటినా ఇక్కడే ఉన్న నేపథ్యంలో పాస్‌పోర్ట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసేవరకూ వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించినట్లు తెలుస్తోంది. వీరంతా దక్షిణాది రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారని సమాచారం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల