కింగ్‌ ఫహాద్‌ కాజ్‌వేపై రికార్డు స్థాయిలో ట్రావెలర్స్‌

కింగ్‌ ఫహాద్‌ కాజ్‌వేపై రికార్డు స్థాయిలో ట్రావెలర్స్‌

బహ్రెయిన్‌: కింగ్‌ ఫహాద్‌ కాజ్‌వే, అత్యధిక సంఖ్యలో ట్రావెలర్స్‌ని రిజిస్టర్‌ చేసింది. ఒకే రోజు 131,000 మంది ఈ కాజ్‌వేని క్రాస్‌ చేయడం కాజ్‌ వే హిస్టరీలోనే ప్రధమం. ఇప్పటిదాకా ఈ కాజ్‌వేపై అత్యధికంగా ప్రయాణించింది 129,437 మంది కావడం గమనార్హం. ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ పాస్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిథి కల్నల్‌ మౌల్లా మర్జోక్‌ అల్‌ ఒతైబి మాట్లాడుతూ, సంబంధిత శాఖల సహకారంతోనే ఈ ఘనతను స్మూత్‌గా సాధించగలిగినట్లు చెప్పారు. మిడ్‌ ఇయర్‌ స్కూల్‌ లీవ్‌ నేపథ్యంలో చాలామందికి బహ్రెయిన్‌ డెస్టినేషన్‌గా మారిందనీ, ఈ క్రమంలోనే అత్యధిక సంఖ్యలో కాజ్‌వేపై ప్రయాణించారని అధికారులు తెలిపారు.

Back to Top