ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాక్‌కు మరోసారి భంగపాటు, కశ్మీర్‌పై మద్దతు కరువు
- January 16, 2020
యూఎన్: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో మరోసారి కశ్మీర్ అంశం లేవనెత్తేందుకు ప్రయత్నించి విఫలమైంది పాకిస్తాన్. ఎలాంటి మద్దతు పాకిస్తాన్‌కు లభించకపోవడంతో చతికిలపడింది. భారత అంతర్గత విషయంలో పదే పదే పాక్ జోక్యం చేసుకోవడాన్ని భారత్ తప్పుబట్టింది.
కాస్త కష్టమైనప్పటికీ భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించేలా పాక్ ప్రయత్నించాలని భారత్ చురకలంటించింది. కశ్మీర్ అంశం పాకిస్తాన్ లేవనెత్తినప్పుడు ఒక్క చైనా తప్పితే మరేదేశం పాకిస్తాన్‌కు మద్దతుగా నిలువలేదు. కశ్మీర్ అంశం రెండుదేశాల మద్య నెలకొన్న వివాదం కావడంతో మిగతా దేశాలు పాకిస్తాన్‌కు అండగా నిలవలేదు.
కశ్మీర్ అంశంపై చైనా తాజాగా గొంతు వినిపించినప్పటికీ అది పెద్దగా ఫలించలేదు. భద్రతామండలి భవనంలో రహస్య సమావేశం జరిగింది. పాకిస్తాన్ మరోసారి కశ్మీర్ అంశం భద్రతామండలిలో తీసుకొచ్చినప్పటికీ మిగతా దేశాలు మద్దతు తెలపకపోవడంతో విఫలమైందన్నారు ఐక్యరాజ్య సమితికి భారత్ నుంచి శాశ్వత దౌత్యాధికారిగా ఉన్న సయ్యద్ అక్బరుద్దీన్.
పాకిస్తాన్ భారత్‌పై పదేపదే చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మే పరిస్థితి లేదని అయినా మళ్లీ ప్రయత్నించడం చూస్తే భారత్‌పై పాకిస్తాన్‌కు ఎంత కక్ష ఉందో అర్థమవుతోందన్నారు సయ్యద్ అక్బరుద్దీన్. కశ్మీర్ అంశం రెండుదేశాల మధ్య నెలకొన్న వివాదం కాబట్టి అందుకు ద్వైపాక్షిక వేదికలు ఉన్నాయని అక్కడ చర్చించుకోవాలని మిగతా ప్రపంచదేశాలు భావించినట్లు సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు.
జమ్మూ కశ్మీర్ అంశంపై చర్చించడం జరిగిందని అన్నారు చైనా రాయబాది జాంగ్ జున్. కశ్మీర్ అంశంపై చర్చించాల్సిందిగా పాక్ విదేశాంగ మంత్రి పలుమార్లు లేఖలు రాసిన సంగతి తెలిసిందే అన్నారు జాంగ్ జున్. జమ్మూకశ్మీర్ అంశం ఎప్పుడూ ఒక అజెండాగానే ఉంటుందని చెప్పిన జాంగ్ జున్... దీనిపై చిన్నపాటి బ్రీఫింగ్ ఇచ్చినట్లు చెప్పారు. కశ్మీర్ అంశంపై చైనా తప్పకుండా జోక్యం చేసుకుంటుందని తమ స్టాండ్‌పై ఇప్పటికే స్పష్టత ఇచ్చామని జాంగ్ జున్ చెప్పారు. ఇక కశ్మీర్ అంశంను చైనా ప్రస్తావించడం ఇది మూడో సారి కావడం విశేషం
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!