కువైట్:ఇక నుంచి ఈ-హెల్త్ సిస్టం..సిక్ లీవ్స్ పై డాక్టర్స్ సంతకం అవసరం లేదు

- January 17, 2020 , by Maagulf
కువైట్:ఇక నుంచి ఈ-హెల్త్ సిస్టం..సిక్ లీవ్స్ పై డాక్టర్స్ సంతకం అవసరం లేదు

కువైట్:ఇక నుంచి సిక్ లీవ్ కోసం ఆస్పత్రి స్టాంప్ వేసి డాక్టర్ సంతకం చేసే వరకు ఎదురుచూడాల్సిన పని లేదు. జనవరి 15 నుంచి కువైట్ లో ఈ-హెల్త్ సిస్టం అమల్లోక రావటంతో ఇక అంతా ఆన్ లైన్ లోనే ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. ఈ మేరకు హస్పిటల్స్, స్పెషల్ హెల్త్ సెంటర్స్ సిస్టమ్ ను హెల్త్ మినిస్ట్రి అప్ డేట్ చేసింది. అన్ని హెల్త్ డిస్ట్రిక్స్, సెంట్రల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్లు తమ పరిధిలోని సిస్టమ్స్.. ఆన్ లైన్ వ్యవస్థకు తగినట్లు యాక్టివేట్ అయ్యాయా..లేదా, ప్రొసిజర్ అంతా కరెక్ట్ గా జరుగుతుందా అనేది చెక్ చేసుకోవాలని హెల్త్ మినిస్ట్రి సూచించింది. అలాగే ఇప్పటికే రిజిస్టర్ అయిన అన్ని ఆస్పత్రులు, స్పెషల్ హెల్త్ సెంటర్లలో పని చేసే డాక్టర్స్ కి ఎలక్ట్రానిక్ సిక్ లీవ్స్ ఎలా మంజూరు చేయాలి,
మెడికల్ రిపోర్ట్స్ ఎలా అప్ డేట్ చేయాలో ట్రైన్ చేస్తోంది. ఈ-హెల్త్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది కనుక ఇక నుంచి సిక్ లీవ్స్ కోసం పేపర్ వర్క్ పై నిషేధం విధించింది. అయితే..అత్యవసర, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ-హెల్త్ సిస్టమ్ లో సేవలు పొందెందకు కువైతీ జాబ్రియాలోని మహమూద్ హాజీ హైదర్ హెల్త్ సెంటర్ లో ప్రత్యేక బ్లాకులను ఏర్పాటు చేశారు. బ్లాక్ 6 ను కువైతీస్ కు కేటాయించగా, బ్లాక్ 7 ను ప్రవాసీయుల కోసం అలాట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com