బుర్జ్‌ అల్‌ అరబ్‌ వద్ద అగ్ని ప్రమాదం

బుర్జ్‌ అల్‌ అరబ్‌ వద్ద అగ్ని ప్రమాదం

దుబాయ్‌: దుబాయ్‌ కోస్ట్‌ వద్ద ఓ వెస్సెల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. బుర్జ్ అల్‌ అరబ్‌కి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. బీచ్‌ గోయర్స్‌, ప్రమాదానికి సంబంధించి పొగను చూసి షాక్‌కి గురయ్యారు. పెద్దయెత్తున సీ షోర్‌కి వారంతా చేరుకుని, ఆ సంఘటనను తిలకించారు. కొందరు ఆ ఘటనను కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ కూడా చేశారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్‌ ఫైటర్స్‌ స్పందించి ఆ మంటల్ని సకాలంలో ఆర్పివేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Back to Top