40,000 వలసదారుల డిపోర్టేషన్‌

40,000 వలసదారుల డిపోర్టేషన్‌

కువైట్‌: 2019లో మొత్తం 40,000 మంది వలసదారులను డిపోర్టేషన్‌ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 13,000 మంది మహిళలుకాగా, 27,000 మంది పురుషులు వున్నారు. 20 దేశాలకు చెందినవారు డిపోర్టేషన్‌కి గురయ్యారు. ఇందులో భారతీయ వలసదారులే అత్యధికం కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశీయులు, ఈజిప్టియన్లు వున్నారు. వివిధ రకాలైన ఉల్లంఘనలకు సంబంధించి నిందితుల్ని డిపోర్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. దేశంలోకి ఎవరూ తిరిగి రాకుండా వుండేందుకు వీలుగా అన్ని చర్యలూ తీసుకుని ఉల్లంఘనులకు డిపోర్టేషన్‌ విధించడం జరిగింది.

Back to Top