రేపటి నుంచీ షిర్డీ ఆలయం నిరవధికంగా మూసివేత
- January 18, 2020
షిర్డీ:సాయిబాబా ఎక్కడ పుట్టారు? ఈ ప్రశ్న మళ్లీ తలెత్తింది. ఇప్పటివరకూ సాయిబాబా జన్మస్థలంగా షిర్డీనే అందరూ చెప్పుకుంటున్నారు. అందుకే అక్కడే ఆలయాన్ని కూడా నిర్మించారు.అయితే... ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా. ఆ ప్రభుత్వం తమ మార్క్ చూపించేందుకు సాయిబాబా జన్మస్థలాన్ని వివాదంలోకి నెట్టింది. సాయిబాబా జన్మస్థలం పర్భణీ జిల్లాకు చెందిన పాథ్రీ అని స్థానికులు నమ్ముతూ... 1999లో శ్రీ సాయి జన్మస్థాన్ మందిరాన్ని నిర్మించారు. వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తుండడంతో ఆ పట్టణం అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తున్నట్లు ఈమధ్యే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ఇదే ఇప్పుడు వివాదమైంది. ఇన్నాళ్లూ లేని సాయి జన్మభూమి అంశం ఇప్పుడే గుర్తొచ్చిందా? అని బీజేపీ మండిపడుతోంది. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు షిర్డీ వాసులు రెడీ అవుతున్నారు. రేపటి నుంచీ షిర్డీ ఆలయాన్ని నిరవదికంగా మూసివేస్తున్నట్లు షిర్డీ సంస్థాన్ ప్రకటించింది. దీంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది.
సాయిబాబా పుట్టింది పాథ్రీయే అనేందుకు ఆధారాలు ఉన్నాయని అక్కడి NCP ఎమ్మెల్యే దుర్రానీ అబ్దుల్లా ఖాన్ అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని ఇదివరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఒప్పుకున్నారు. పాథ్రీకి ప్రాధాన్యం ఇస్తే... తమ క్షేత్ర ప్రాధాన్యం తగ్గుతుందని షిర్డీ వాసులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడీ సమస్య ఎక్కడి దాకా వెళ్తుందో చెప్పలేని పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం మాత్రం... తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ప్రభుత్వంలో భాగమైన NCP, కాంగ్రెస్ సైతం... శివసేనకు మద్దతు పలికాయి. చూస్తుంటే... షిర్డీ లాగే... పాథ్రీ కూడా ఇకపై మరో సాయి జన్మభూమిగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే... షిర్డీ వాసులు మొదలుపెట్టబోతున్న న్యాయ పోరాటం ఎక్కడిదాకా వెళ్తుందన్నది మరో ప్రశ్నగా మారనుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







