ఎన్టీఆర్‌కు నందమూరి కుటుంబసభ్యుల నివాళులు
- January 18, 2020
హైదరాబాద్:టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 24వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబసభ్యులు ఆయనకు నివాళులర్పించారు. శనివారం ఉదయం నెక్లెస్‌రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, పురందేశ్వరి, సుహాసిని, రామకృష్ణ తదితరులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ చుట్టూ ప్రదక్షణ చేసి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ, సుహాసిని మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగపురుషుడన్నారు. ఎన్టీఆర్ ఆశయసాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఆడపడుచుల కోసం ఎన్టీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పారు. తెలుగుజాతి కీర్తిప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్‌దే అని రామకృష్ణ, సుహాసిని అన్నారు.
మరోవైపు పెద్దసంఖ్యలో అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో ఆయన అభిమానులు, రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు