ఎస్‌బీఐలో ఉద్యోగావకాశాలు
- January 18, 2020
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 7870 క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్ రీజియన్‌లో 375 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ 2020 జనవరి 26. డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్ https://sbi.co.in/ ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో latest announcements పై క్లిక్ చేస్తే recruitment of junior associates లింక్ కనిపిస్తుంది. అందులో apply online పైన క్లిక్ చేయాలి. అప్పుడు కొత్త పేజి ఓపెన్ అవుతుంది.
కొత్త పేజీలో click here for new registration పైన క్లిక్ చేయాలి. మీ పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ ప్రొవిజినల్ రిజిస్టర్ నెంబర్, పాస్‌వర్డ్ జనరేట్ అవుతాయి. వాటిని గుర్తు పెట్టుకోవాలి. మీ రిజిస్టర్ ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్‌కు ఈ వివరాలు వస్తాయి. తరువాత స్టెప్‌లో మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
మీ ఫొటో సంతకం, ఎడమచేతి బొటన వేలిముద్ర, డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు పే చేయాలి. చివరిగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..