'బీ రోడ్ సేఫ్' క్యాంపేన్...బస్టాప్ సైన్స్ ఇగ్నోర్ చేస్తే AED 1000 ఫైన్
- January 19, 2020అబుదాబి : బస్ స్టాప్ సైన్స్ ఇగ్నోర్ చేసే మోటరిస్ట్ ల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని అబుదాబి పోలీసులు హెచ్చరించారు. స్కూల్ బస్సుల కు రూట్ క్లియర్ చేసేందుకు స్టాప్ సైన్ డిస్ ప్లే కాగానే మోటరిస్టులు ఆగిపోవాల్సిందేనని సూచించింది. 'బీ రోడ్ సేఫ్ క్యాంపేన్' లో భాగంగా సోషల్ మీడియా వేదికగా అబుదాబి పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను గుర్తుచేశారు. ఎవరైనా ఈ నిబంధలను పాటించకుంటే Dh1000 ఫైన్ తో పాటు 10 బ్లాక్ పాయింట్స్ యాడ్ అవుతాయని వార్నింగ్ ఇచ్చారు. స్కూల్ బస్సులకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎవరైనా మోటరిస్ట్ స్టాప్ సైన్ ను ఇగ్నోర్ చేస్తూ వాహనాలను ఆపకుండా వెళ్తే సీసీ ఫూటేజ్ ఆధారంగా మోటరిస్ట్ ను గుర్తించి ఫైన్ విధిస్తామని గత సెప్టెంబర్ లోనే తెలిపింది. 2018-19లో 3,664 డ్రైవర్లకు ఫైన్ విధించినట్లు వెల్లడించింది. అంతేకాదు ఒకవేళ స్కూల్ బస్సు డ్రైవర్లు స్టాప్ సైన్ డిస్ ప్లే చేయకుంటే Dh500 ఫైన్ విధిస్తామని అలాగే..6 బ్లాక్ పాయింట్లు యాడ్ అవుతాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు