'ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్' అందుకున్న అల్లు అరవింద్
- January 20, 2020
ఢిల్లీ:ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్‌ను భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న అల్లు అరవింద్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అందరికీ సుపరిచితమే. ఆయన చిత్రాలకు ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అల్లు అరవింద్ తెలుగులో కాకుండా తమిళ, హిందీ, కన్నడ భాషల్లో చిత్రాలను నిర్మించారు. రజినీకాంత్, చిరంజీవి, అనిల్ కపూర్, గోవిందా, అమీర్ ఖాన్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలతో ఆయన చిత్రాలు తీశారు.
అలాంటి అల్లు అరవింద్ సినిమాకు చేసిన సేవలకుగానూ 'ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ 2019'కి ఎంపికయ్యారు. ఈరోజు (సోమవారం) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 'ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ 2019'ని అల్లు అరవింద్‌కు ప్రదానం చేశారు. సోషియల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనిటీ సర్వీస్ చేసిన వారికి ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డ్స్‌ను ఈ ఏడాది నలుగురు ముఖ్యమంత్రులు, కొంతమంది స్పోర్ట్స్ ఛాంపియన్స్ అరవింద్‌తో పాటు స్వీకరించబోతున్నారు. సినిమా రంగానికి చెందిన వ్యక్తి కేటగిరీలో అల్లు అరవింద్ ఈ అవార్డ్ అందుకోవడం విశేషం.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!