దావోస్ లో పర్యటిస్తున్న కేటీఆర్
- January 20, 2020
దావోస్:వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ స్వరం వినిపించనుంది. స్విస్‌లోని దావోస్‌లో జరుగుతున్న సదస్సుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లారు. ఐటీ, ఫార్మా, రియల్, ఇండస్ట్రీస్ వంటి రంగాల్లో ప్రపంచ ఖ్యాతిపొందిన తెలంగాణాలో... మరిన్ని పెట్టుబడులకు కేటీఆర్ ప్రసంగం ఊతమివ్వనుంది. నాలుగు రోజులపాటు జరిగే సదస్సుకు కేటీఆర్ బయల్దేరి వెళ్లారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనేందుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనకు వెళ్లారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో 50వ వార్షిక సదస్సు జరగనుంది. ఫోరం నుంచి కేటీఆర్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. 2018లో తొలిసారిగా ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. 2019లో నిర్వహించిన సదస్సుకు ఫోరం నుంచి ఆహ్వానం అందినా హాజరు కాలేకపోయారు. ఈ ఏడాది 50వ వార్షిక సదస్సు కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ సదస్సు జరగనుంది. సదస్సులో భాగంగా నిర్వహించే పలు చర్చల్లో కేటీఆర్ ప్రసంగించనున్నారు.
తెలంగాణ ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజేయనున్నారు మంత్రి కేటీఆర్. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో కేటీఆర్ పత్యేక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్.. కేటీఆర్‌తో పాటు దావోస్‌కు వెళ్లారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!