వాడని మందుల్ని పారవేయొద్దు, ఇతరులకు డొనేట్‌ చేయండి

వాడని మందుల్ని పారవేయొద్దు, ఇతరులకు డొనేట్‌ చేయండి

దుబాయ్:వివిధ కారణాలతో వైద్య చికిత్స నిమిత్తం మందుల్ని కొనుగోలు చేసేవారు, వాటిల్లో కొన్ని మందులు ఉపయోగించని పక్షంలో, ఇతరులకు దానం చేయొచ్చు. వినియోగంలోకి పనికొచ్చే మందుల్ని అలా డొనేట్‌ చేయడం వల్ల చాలామందికి అవి అవసరమవుతాయి. దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ (డిహెచ్‌ఎ), 2013 నుంచి 'క్లీన్‌ యువర్‌ మెడిసిన్‌ క్యాబినెట్‌' పేరుతో ఓ అవగాహనా కార్యక్రమం చేపడుతోంది. 2019లో 12 మిలియన్‌ దిర్హామ్‌ల విలువైన మందుల్ని ఈ క్యాంపెయిన్‌ ద్వారా సేకరించారు. ఇప్పటిదాకా 29.5 మిలియన్‌ దిర్హామ్‌ల విలువైన మందుల్ని అవసరమైనవారికి అందించడం జరిగింది. సాధారణంగా చాలామంది అవసరం లేని మెడిసిన్స్‌ని డస్ట్‌ బిన్స్‌లో పడేస్తుంటారు. కానీ, ఇకపై అలా చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Back to Top