మస్కట్‌కి వర్ష సూచన

మస్కట్‌కి వర్ష సూచన

మస్కట్‌:మంగళవారం నుంచి నార్తరన్‌ గవర్నరేట్స్‌ అలాగే మస్కట్‌లో వర్షాలు కురవనున్నాయి. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌ (పిఎసిఎ) అధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. సుల్తానేట్‌లో రానున్న రోజుల్లో కెరటాలు, డిప్రెషన్స్‌ కారణంగా పరిస్థితులు కొంత గందరగోళంగా తయారవుతాయని ఆయన హెచ్చరించారు. నార్త్‌ బతినా, ముసాందం, సౌత్‌ అల్‌ బతినాహ్‌, నార్త్‌ అల్‌ బతినాహ్‌, మస్కట్‌ అలాగే సౌత్‌ అల్‌ షర్కియా గవర్నరేట్స్‌లో వర్షాలు బాగా కురుస్తాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం వుంది. జనవరి 25 వరకు ఇవే వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి.

Back to Top