300,000 సిక్‌ లీవ్స్‌ జారీ

300,000 సిక్‌ లీవ్స్‌ జారీ

కువైట్‌: గడచిన డిసెంబర్‌ నుంచి కొత్త విధానం ద్వారా 300,000 సిక్‌ లీవ్స్‌ జారీ అయ్యాయని డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ - మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ ఇంజనీర్‌ అహ్మద్‌ ఘరీబ్‌ వెల్లడించారు. కొత్త ఎలక్ట్రానిక్‌ సిక్‌ లీవ్‌ సిస్టమ్‌, ఖర్చు తగ్గించడంతోపాటు, ట్యాంపరింగ్‌కి అవకాశం లేకుండా చేసిందని ఆయన వివరించారు. ఆసుపత్రుల్లో ప్రముఖ వైద్యుల ద్వారా ఈ ధృవీకరణ జరుగుతుందనీ, ఎక్కడా ఎలాంటి టాంపరింగ్‌కి అవకాశం వుండదనీ, పొరపాట్లకు తావు వుండదని అధికారులు చెబుతున్నారు. గవర్నమెంట్‌ ఏజెన్సీలు, ఈ కొత్త విధానం ద్వారా సిక్‌ లీవ్‌ వాలిడిటీని కూడా వెరిఫై చేయడానికి వీలుంటుంది.

Back to Top