యూఏఈ డెబ్టర్స్‌, అబ్‌స్కాండర్స్‌కి ఇండియాలోనూ శిక్షలు

యూఏఈ డెబ్టర్స్‌, అబ్‌స్కాండర్స్‌కి ఇండియాలోనూ శిక్షలు

దుబాయ్:యూఏఈలో పలు కారణాలతో కేసుల్లో ఇరుక్కుపోయి, శిక్షలు ఎదుర్కొంటున్నవారు అథారిటీస్‌ కళ్ళు గప్పి భారతదేశానికి వెళ్ళిపోతే, అలాంటివారికి భారతదేశంలోనూ శిక్ష పడేందుకు వీలుగా కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఇండియా అధికారికంగా యూఏఈ కోర్టులను గుర్తించింది. ఫెడరల్‌ సుప్రీం కోర్ట్‌, ది ఫెడరల్‌, ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ అండ్‌ అప్పీల్స్‌ కోర్ట్‌ ఇన్‌ అబుదాబీ, షార్జా, అజ్మన్, ఉమ్‌ అల్‌ కువైన్‌ మరియు ఫుజారియా కోర్టులకు ఈ గుర్తింపు లభించింది. కొత్త రూల్‌, అబుదాబీ జ్యుడీషియల్‌ డిపార్ట్‌మెంట్‌, దుబాయ్‌ కోర్ట్స్‌, రస్‌ అల్‌ ఖైమా జ్యుడీషియల్‌ డిపార్ట్‌మెంట్‌, కోర్ట్స్‌ ఆఫ్‌ అబుదాబీ గ్లోబల్‌ మార్కెట్స్‌, కోర్ట్స్‌ ఆఫ్‌ దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సెంటర్‌ వంటివాటినీ గుర్తిస్తుంది. ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌ మాట్లాడుతూ, యూఏఈలో భారతీయ వలసదారులెవరైనా నేరానికి పాల్పడి, శిక్షకు గురైతే, ఆ జడ్జిమెంట్‌ని భారత ప్రభుత్వం కూడా గుర్తిస్తుందని చెప్పారు.

Back to Top