చికెన్ సూప్ తీసుకుంటే...
- January 21, 2020తుమ్ములతో ముక్కు కారిపోతూ ఉంటే చికెన్ సూప్ కంటే మించింది లేదని కొందరు చెపుతారు. మరికొందరు అల్లం, తేనె కలిపిన టీ, నిమ్మకాయ పనిచేస్తుందంటారు. అయితే సాధారణ జలుబు అయినా దానిపట్ల మరింతగా శ్రద్ధ వహించవలసిందే.
తుమ్ములు, జలుబుతో బాధపడుతూ ఉద్యోగానికి వెళ్లడం సరైంది కాదు. అలాగే తల, శరీరం నొప్పులు, జ్వరం లాంటివి ఉన్నప్పుడు, తుమ్ములతో జలుబు మొదలైనప్పుడు పారాసిటమాల్ బిళ్లలు, వేపొరబ్స్ లాంటివి వాడినా అవి శాశ్వత పరిష్కారం కాదు.
ఆయా సీజన్లలో వచ్చే జలుబులకు సరైన చికిత్స చేయకపోతే అవి క్రమంగా ఆస్తమాగా మారే అవకాశం ఉందని అలర్జీల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు చేసి తుమ్మినప్పుడు వెలువడే సూక్ష్మజీవులు ఇతరులకు వ్యాపించి వారికి కూడా జలుబు సోకుతుంది. అందువల్ల జలుబు చేసినప్పుడు ఆఫీసుకు వెళ్లి ఇతరులకు దాన్ని వ్యాపింపచేయడం కంటే విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెపుతారు.
జలుబు సాధారణంగా 7 నుంచి 12 రోజులలో తగ్గుతుంది. ఇలాంటి వైరల్ వ్యాధులకు యాంటీ బయోటిక్స్ వాడటం కంటే హాయిగా విశ్రాంతి తీసుకోవడమే మంచిది. వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం లేదా మరిగిన నీటి ఆవిరిని పట్టి, విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు