తొలి మహిళా విభాగాన్ని ప్రారంభించిన సౌదీ మిలిటరీ
- January 21, 2020
సౌదీ మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఫయ్యాద్ అల్ రువాలి, మహిళల కోసం తొలి మిలిటరీ సెక్షన్‌ని సౌదీ అరేబియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో ప్రారంభించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ అడ్మిషన్ అండ్ ఎనిస్ట్‌మెంట్ మేజర్ జనరల్ ఇమాద్ అల్ ఐదన్, రెగ్యులేషన్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్‌తోపాటు ఫిమేల్ స్టాఫ్ ఎక్కడ స్టేషన్ చేయబడ్తారనే విషయాల్ని వివరించారు. 2019 అక్టోబర్‌లో చేసిన ప్రకటనకు అనుగుణంగా మరింత మంది మహిళలకు ఈ విభాగంలో అవకాశాలు కల్పిస్తారు. లాన్స్ కార్పొరల్స్, కార్పొరల్స్, సర్జంట్స్, స్టాఫ్ సర్జంట్స్ పోస్టుల్లో వీరిని నియమిస్తారు. రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్, సౌదీ అరేబియన్ నేవీ, ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్, స్ట్రాటజిక్ మిస్సైల్ ఫోర్సెస్ అలాగే ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసుల్లో వీరికి అవకాశాలు కల్పిస్తున్నారు. సీనియర్ ర్యాంకులకు మహిళలు చేరుకునేలా కూడా అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







