22-24 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం

- January 21, 2020 , by Maagulf
22-24 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం

మస్కట్‌:సుల్తానేట్‌లోని నార్తరన్‌ గవర్నరేట్స్‌ పరిధిలో జనవరి 22 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఒమన్‌ మిటియరాలజీ పేర్కొంది. ఈ వర్షాల కారణంగా ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే అవకాశం వుందనీ, ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముసాందమ్‌, బురైమి తదితర ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత ఎక్కువగా వుండొచ్చు. సముద్ర తీరంలో కెరటాలు 2 మీటర్లకు పైగానే ఎగసిపడొచ్చు. గవర్నరేట్‌లోని మిగతా ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌, ఈ మేరకు అప్రమత్తత ప్రకటన చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com