సైకిళ్ళకూ రిజిస్ట్రేషన్‌.?

- January 23, 2020 , by Maagulf
సైకిళ్ళకూ రిజిస్ట్రేషన్‌.?

బహ్రెయిన్:కార్లు, బైక్‌లకు ఎలాగైతే రిజిస్ట్రేషన్‌ అవసరమో, సైకిళ్ళకూ అదే తరహాలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అమలు చేసే దిశగా ప్రపోజల్‌ ఒకటి తెరపైకొచ్చింది. నార్తర్న్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ హెడ్‌ అహ్మద్‌ అల్‌ కూహెజి ఈ విషయాన్ని వెల్లడించారు. సైకిళ్ళ కారణంగా ప్రమాదాలు పెరుగుతున్న దరిమిలా, ఈ ప్రపోజల్‌ తెరపైకి వచ్చినట్లు చెప్పారాయన. సైకిళ్ళకు ఏడాదికి 5 బహ్రెయినీ దినార్స్‌ ఫీజు వర్తించేలా ఈ ప్రపోజల్‌ రూపొందిందని ఆయన అన్నారు. ఇటీవలే బుడైయాలో జరిగిన రెండు ప్రమాదాలోల& ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని, వారి మృతికి సైకిళ్ళే కారణమని తేలిందని చెప్పారాయన. కాగా, ఈ ప్రపోజల్‌ పట్ల పెద్దయెత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com