జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ చేయలేదు-సౌదీ ఎంబసీ
- January 23, 2020
అమెరికా:ప్రఖ్యాత ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఫోన్ 2018లో హ్యాకింగ్‌కు గురైనట్టు సమాచారం. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వ్యక్తిగత మొబైల్ నుంచి పంపిన ఓ వాట్సాప్ సందేశం వల్లే హ్యాకింగ్ జరిగినట్టు ప్రముఖ ఆంగ్ల పత్రిక గార్డియన్ తన కథనంలో పేర్కొంది. ఆ సందేశం ద్వారా ఓ హానికరమైన వైరస్ బెజోస్ ఫోన్‌లో చొరబడినట్టు ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. వీరివురి మధ్య 2018, మే 1న జరిగిన స్నేహాపూర్వక చాటింగ్‌లో భాగంగా పంపిన ఓ వీడియో సందేశం ద్వారా బెజోస్ ఫోన్‌లో వైరస్ చొరబడినట్టు గుర్తించారు. దీని వల్ల ఆయన ఫోన్‌లోని సమాచారం భారీ స్థాయిలో తస్కరణకు గురైనట్టు గుర్తించారు. అది ఎటువంటి సమాచారం అన్నది మాత్రం తెలియరాలేదు. బెజోస్ కూడా తన ఫోన్ హ్యాకింగ్‌కు గురైందని సల్మాన్‌పై ఆరోపణలు చేశారు. పశ్చిమ దేశాల పెట్టుబడిదారులను ఆకర్షించాలన్న యువరాజు ప్రయత్నాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. బెజోస్ వ్యక్తిగత జీవితంపై 'నేషనల్ ఎంక్వైరర్' అనే పత్రిక పలు రహస్య విషయాలను ప్రచురించిన విషయం తెలిసిందే. మొబైల్ సందేశాలతో సహా వెల్లడించడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ సందేశాలతో ఆయన వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన భార్య మెకంజీ.. బెజోస్‌కు విడాకులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా హ్యాకింగ్ అంశంపై అనేక అనుమానాలకు తావిస్తోంది.
అమెరికాలోని సౌదీ ఎంబసీ స్పందన
వాట్సప్ మెసేజ్ ద్వారా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందని వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ వాషింగ్టన్‌లోని సౌదీ ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ ట్విటర్ ద్వారా అధికారులు స్పందిస్తూ.. బెజోస్ ఫోన్ హ్యాక్‌కు గురైందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మహ్మద్ బిన్ సల్మాన్‌కు బెజోస్ ఫోన్ హ్యాక్ చేయాల్సిన అవసరం ఏముంటదని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు