షార్జా లో ఫోన్ పోకొట్టుకున్న యువతికి సహాయం చేసిన పోలీస్
- January 23, 2020
షార్జా:షార్జా నుంచి ఇండియాకు వస్తూ షార్జా ఎయిర్‌పోర్టులో ఓ భారతీయురాలు తన ఫోన్‌ను పోగొట్టుకుంది. ఇదే విషయాన్ని ఆమె మంగళవారం మధ్యాహ్నం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి షార్జా పోలీసుల సాయం కోరింది. తన ఫోన్‌కు సంబంధించిన ఫొటోలను సైతం ఆమె పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ పోస్ట్‌ను చూసిన సయిద్ అనే షార్జా పోలీస్ ఆఫీసర్ వెంటనే భారతీయురాలి మొబైల్‌ను వెతికే పనిలో పడ్డారు. ఫోన్‌కు సంబంధించిన వివరాలు, ఎక్కడ, ఎలా పోగొట్టుకున్నది యువతిని అడిగి తెలుసుకున్నారు.
యువతి తెలిపిన సమాచారంతో.. సయిద్ అతి తక్కువ సమయంలోనే ఫోన్ ఎక్కడున్నది చేధించి వెంటనే భారత్‌కు పంపించేశారు. యువతి భారత్‌కు చేరుకున్న మూడు గంటల్లోనే ఆమెకు తన ఫోన్ చేరింది. దీంతో షార్జా పోలీసుల మంచితనానికి తాను ముగ్దురాలైనట్టు భారతీయురాలు ఆనందం వ్యక్తం చేసింది. తన ఫోన్‌ను వెతికిపెట్టి భారత్‌కు పంపిన సయిద్‌కు ట్విట్టర్ ద్వారా “ఐ సెల్యూట్ షార్జా పోలీస్...థ్యాంక్ యూ కెప్టెన్ సయిద్ ఫ్రొం షార్జా ఎయిర్పోర్ట్ పోలీస్” అని తెపిలింది.
ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. పర్యాటకుల అంచనాలకు మించి వారికి ఉత్తమమైన సర్వీస్ అందించడానికి తాము నిత్యం పనిచేస్తామంటూ సయిద్ ఈ సందర్భంగా చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..