వీడుతున్న కరోనా వైరస్ మిస్టరీ...పాము నుంచి వైరస్ సోకుతున్నట్లు గుర్తింపు

వీడుతున్న కరోనా వైరస్ మిస్టరీ...పాము నుంచి వైరస్ సోకుతున్నట్లు గుర్తింపు

సౌదీ అరేబియా:ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మిస్టరీ వైరస్ కరోనా గుట్టు వీడుతోంది. ప్రణాంతకమైన వైరస్ మనుషుల్లోకి ఎలా సోకుతుందో నిన్నటి వరకు అంతుచిక్కలేదు. వైరస్ ఎలా సోకుతుందో కనుక్కోగలిగితే చాలావరకు వైరస్ వ్యాప్తిని నివారించొచ్చు. దీంతో కరోనా కారకాలపై స్టడీ చేసిన చైనా సైంటిస్టులు..వైరస్ కు పాములే కారణమని తేల్చారు. పాముల్లో ఉండే వైరస్ మెల్లిమెల్లిగా స్నేక్ మార్కెట్ల ద్వారా అక్కడి మనుషుల్లోకి ప్రవేశించి ఉండొచ్చని జర్నల్ ఆఫ్ మెడికల్ వైరాలజీలో స్టడీ వివరాలను వెల్లడించారు. తుమ్ము, దగ్గుతో వేగంగా ఇతరులకు వ్యాపిస్తోందని గుర్తించారు. చైనాలో ఇప్పటికే దాదాపు 4000 వేల మందికి వ్యాపించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్ తో 18 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు వైరస్ వ్యాప్తి చెందకుండా చైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. హుబెయ్ ప్రావిన్సులోని వుహాన్, ఝిజియాంగ్, ఖియాన్ జింగ్, హుయాంగ్ గాంగ్, ఎఝౌ సిటీస్ లో అధికారులు ఆంక్షలు విధించారు. ఆయా నగరాలకు రాకపోకలను నిషేధించారు. చివరికి చైనా న్యూ ఇయర్ ప్రార్థనలను కూడా రద్దు చేశారు.

ఇదిలా ఉంటే సౌదీ అరేబియా ఆస్పత్రిలో పని చేసే ఓ ఇండియన్ నర్సుకు కరోనా వైరస్ సోకినట్లు జరుగుతున్న ప్రచారాన్ని సౌదీ ఆరోగ్య శాఖ ఖండించింది. తమ దేశంలో ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని సౌదీ సెంటర్ ఫర్ డిసీస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అధికారులు ప్రకటించారు. కేరళా నర్సు వైరస్ బారిన పడినట్లు ఇండియా మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేస్తూ ట్వీట్ చేసింది.

Back to Top