దుబాయ్‌ కాప్‌పై దాడి: ఇద్దరు మహిళలకు జైలు

దుబాయ్‌ కాప్‌పై దాడి: ఇద్దరు మహిళలకు జైలు

దుబాయ్‌:మద్యం సేవించి, ఆ మత్తులో దుబాయ్‌ కాప్‌పై దాడి చేసిన ఇద్దరు మహిళలకు ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితులిద్దరూ కెనడియన్‌ వలసదారులుగా గుర్తించారు. వీరిలో ఒకరు బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తోంటే, మరొకరు డిజైన్‌ మేనేజర్‌. గత ఏడాది జులై 19న ఈ ఫఘటన జరిగింది. పెట్రోలింగ్‌ డ్యూటీలో వున్న పోలీస్‌ అధికారిపై నిందితులు దాడి చేశారు. మద్యం మత్తులో వున్న మహిళలు తన కారు ఎక్కారనీ, వారు కోరుకున్న చోట డ్రాప్‌ చేయగా, తగిన ఫేర్‌ చెల్లించేందుకు వారు సుముఖత వ్యక్తం చేయకపోగా, తనపై దాడికి యత్నించారని ఓ క్యాబ్‌ డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్రోలింగ్‌ సిబ్బంది పరిస్థితిని ఆరా తీసే క్రమంలో, ఇద్దరు నిందితులు ఆ పోలీస్‌ అధికారిపై దాడికి దిగారు.
  

Back to Top