“డిస్కో రాజా” మూవీ రివ్యూ

- January 24, 2020 , by Maagulf
“డిస్కో రాజా” మూవీ రివ్యూ

చాలా కాలం గ్యాప్ తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరోగా పాయల్ రాజ్ పుత్ మరియు నభ నటేష్ లు హీరోయిన్లుగా వైవిధ్య దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “డిస్కో రాజా” టైటిల్ కార్డు తోనే మంచి ఆసక్తి రేపిన ఈ చిత్రం ఈరోజే మంచి డీసెంట్ బజ్ నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ చిత్రం అయినా అందరి టాలీవుడ్ హీరోల అభిమానుల అభిమాన హీరో అయిన రవితేజ కు మంచి హిట్ ఇచ్చిందా లేదా అన్నది ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :
కథలోకి వెళ్లినట్టయితే రవితేజ లడఖ్ ప్రాంతంలో ఒక ఐస్ ట్రెక్కింగ్ చేస్తున్న ఒక గ్రూప్ కు స్పృహ లేకుండా దొరుకుతాడు.ఇదే నేపథ్యంలో మరోపక్క నభా నటేష్ మరియు నరేష్ సహా కొంతమంది సైంటిస్టులు చనిపోయిన మనుషుల్లో మళ్ళీ జీవం పోసే రీసెర్చ్ చేస్తుంటారు.అలా వారికి రవితేజ దొరకగా అతనిపై వీరు ఎలా రీసెర్చ్ చేసారు? ఈ యంగ్ లుక్ రవితేజ మరియు వింటేజ్ లుక్ లో ఉన్న రవితేజలు ఒక్కరేనా?లేక ఇద్దరా?ఈ “డిస్కో రాజా” ఎవరు..అసలు లాస్ట్ కు ఎండింగ్ ఎలా వచ్చింది?అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :
మారుతున్న కాలంతో పాటుగా మన తెలుగు ఆడియన్స్ అభిరుచులు కూడా మారాయి.అలా ఈ మధ్య కాలంలో వినూత్న కాన్సెప్ట్ తో వచ్చి వాళ్ళని కానీ మెప్పించినట్టయతే ఆ చిత్రాలను అందనంత ఎత్తులో తీసుకెళ్లి పెడుతున్నారు.ఈ “డిస్కో రాజా” సినిమా కూడా అలాంటిదే అని రవితేజ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు.ఆ నమ్మకాన్ని ఏ చిత్రం నిలబెట్టింది అని చెప్పాలి.సినిమా స్టార్టింగ్ లోనే ఆసక్తికర నరేషన్ తో దర్శకుడు మొదలు పెట్టారు.

అంతే కాకుండా తాము ఎంచుకున్న పాయింట్ కూడా చాలా వినూత్నంగా ఉండడమే కాకుండా దానిని తెరకెక్కించిన విధానం ఖచ్చితంగా సినిమా చూసే ప్రేక్షకులను థ్రిల్ చెయ్యక మానదు.అలా ఫస్ట్ హాఫ్ మంచి ఆసక్తికరంగా ఎక్కడ ఎంత వరకు అవసరమో అలా కొనసాగుతుంది.అంతే కాకుండా ఫస్ట్ హాఫ్ లోనే వింటేజ్ లుక్ లో రవితేజ ఎనర్జీ కానీ అదే ఊపులో వచ్చే ఫ్రీక్ అవుట్ సాంగ్ కానీ సూపర్బ్ గా అనిపిస్తాయి.

ఇలా ఫస్ట్ హాఫ్ సెకండాఫ్ పై ప్రేక్షకుడికి మరింత ఆసక్తిని పెంచేలా చేస్తుంది.అలా సెకండాఫ్ కు వచ్చేసరికి పూర్తిగా ఒక వింటేజ్ ఫీల్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది.కానీ ఫస్ట్ హాఫ్ లో నడిచిన ఆసక్తికర కథనం పూర్తిగా మారినట్టు అనిపిస్తుంది.ఇక నటీనటుల విషయానికి వస్తే మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ కోసం ఏమని చెప్తాం..రెండు లుక్స్ లో తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ను సిల్వర్ స్క్రీన్ పై చూస్తుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ ఎలా అసలు అనిపిస్తుంది.

ఆ రేంజ్ లో చేశారు.ముఖ్యంగా “డిస్కో రాజా” పాత్రతో సినిమాకు ఒక సరికొత్త ఎనర్జీ ఇచ్చారని చెప్పాలి.ఇద్దరు హీరోయిన్లు పాయల్ రాజ్ పుత్ మరియు నభా నటేష్ లు రెండు షేడ్స్ కు తగ్గట్టుగా మంచి నటన కనబర్చారు.అలాగే ఇతర పాత్రల్లో నటించిన నరేష్,వెన్నెల కిషోర్ అలాగే వింటేజ్ టైం లో సునీల్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు.ముఖ్యంగా విలన్ రోల్ లో కనిపించిన బాబీ సింహా తనలోని విలన్ యాంగిల్ ను అద్భుతంగా చూపించారు.

ఇక దర్శకుని పనితనంకు వచ్చినట్టయితే వి ఐ ఆనంద్ కు తన రెండు చిత్రాల ద్వారా మన టాలీవుడ్ లో ఇతర దర్శకులతో వేరు చేసే విధంగా ఒక ప్రత్యేకత ఏర్పరచుకున్నారు.తన సినిమా అంటే ఒక కొత్త ప్లాట్ లైన్ అన్నట్టుగా ఈ సినిమాకు కూడా అలాగే ఎంచుకొని దాన్ని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు.కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి మాత్రం ఫస్టాఫ్ నుంచి కొనసాగిన టెన్స్ వాతావరణం సెకండాఫ్ లో కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది.

కానీ అది కూడా పెద్ద ఎఫెక్ట్ అనిపించదు.అలాగే సంగీతం అందించిన థమన్ అందించిన పాటల్లో రెండు మినహా మిగతా పాటలు జస్ట్ ఓకే అని చెప్పొచ్చు.బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా అనిపించకపోవచ్చు.కానీ ఈ సినిమాలోని పాటలు విజువల్ పరంగా ఆకట్టుకుంటాయి.అలాగే కార్తీక్ గట్టంనేని అందించిన సినిమాటోగ్రఫీ చిత్రానికి మరో మెయిన్ ఎస్సెట్ అని చెప్పొచ్చు.రెట్రో టైం ఫ్రేమ్స్ అలాగే ఇప్పటి రోజుల్లోకు తగ్గట్టు చక్కటి సినిమాటోగ్రఫీ అందించారు.

ప్లస్ పాయింట్స్ :
రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్
కాన్సెప్ట్
కథానుసారం వచ్చే ట్విస్టులు

మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా కాస్త డల్ అనిపించే సెకండాఫ్
ఓవరాల్ గా మెప్పించని సంగీతం

తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే రవితేజ మరియు వి ఐ ఆనంద్ ల కాంబోలో తెరకెక్కిన ఈ స్కైఫై థ్రిల్లర్ ఆకట్టుకునే నరేషన్ తో పాటుగా రవితేజ రెండు షేడ్స్ లో ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ లు మెయిన్ ఎస్సెట్ గా మారగా సెకండాఫ్ లోని అక్కడక్కడా సినిమా జస్ట్ ఓకే అనిపిస్తుంది కానీ అది పెద్దగా ఎఫెక్ట్ అనిపించకపోవచ్చు..మొత్తానికి మాత్రం కేవలం ఆడియన్స్ కు మంచి థ్రిల్ ఇవ్వడమే కాకుండా మాస్ మహారాజ్ కెరీర్ లో ఈ చిత్రం ఒక థ్రిల్లింగ్ జానర్ చిత్రంగా “డిస్కో రాజా” నిలుస్తుంది అని చెప్పాలి.

మాగల్ఫ్.కామ్ రేటింగ్: 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com