మీ పిల్లల చివరి చూపునకు రండి: నిర్భయ దోషుల కుటుంబీకులకు సమాచారం పంపిన జైలు అధికారులు
- January 24, 2020
నిర్భయ కేసులో దోషులకు రోజులు దగ్గర పడుతున్నాయి. రివ్యూ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఫలితాన్ని ఇవ్వని తరుణంతో.. ఫిబ్రవరి 1న వారి ఉరితీతకు ముహూర్తం ఖరారైంది. తిహార్ జైలులో వారి ఉరితీతకు.. ఇప్పటికే ఇసుక బస్తాలతో రిహార్సల్స్ కూడా పూర్తయ్యాయి.
ఇలా ఉరితీత ఖాయమైన నేపథ్యంలో దోషుల కుటుంబీకులకు జైలు అధికారులు సమాచారం పంపారు. 'మీ పిల్లలకు ఫిబ్రవరి 1 చివరి రోజు. ఆ రోజు ఉరి తీస్తున్నాం. చివరి చూపునకు రండి' అని ఆనవాయితీ ప్రకారం పిలుపు పంపారు. అంతకు ముందు.. దోషుల చివరి కోరికను అడిగితే.. ఎవరూ సమాధానం చెప్పకుండా.. మౌనంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో.. నిర్భయ కేసు దోషుల కుటుంబీకులు వారి పిల్లలను చూసుకునేందుకు జైలుకు వెళ్తారా? అసలు వారి ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు జైలులో ఉన్న ఆ నలుగురి మానసిక పరిస్థితి ఎలా ఉంది? అన్నది.. అందరినీ ఆలోచింపజేస్తోంది.
ఈ భావోద్వేగాల సంగతి ఎలా ఉన్నా.. ఆ నలుగురు దోషుల ఉరి తీత మాత్రం ఖాయం. ఈ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కారాగారంలో దోషులు ఎలా ఉన్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? అన్నది నిరంతరం కనిపెడుతూ ఉన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!