సీఎం జగన్ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు:సుమన్

- January 25, 2020 , by Maagulf
సీఎం జగన్ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు:సుమన్

 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంత రైతులు వారికి ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ విషయంలో సినీ పరిశ్రమను కోరితే ‘మా’మూవీ అసోసియేషన్ తరఫున తప్పకుండా తమ వంతు సహకారం అందిస్తామన్నారు. మాచర్లలో సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాజధాని అమరావతిలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. మూడు రాజధానుల విషయంలో సీఎం అసలు ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదన్నారు. సీఎం జగన్‌ను కలవడానికి ఐదుసార్లు ప్రయత్నించానని, అయితే తనకు అపాయింట్‌మెంట్ దొరకలేదని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com