'పద్మశ్రీ' పురస్కారాలు ప్రకటించిన భారత కేంద్ర ప్రభుత్వం

- January 25, 2020 , by Maagulf
'పద్మశ్రీ' పురస్కారాలు ప్రకటించిన భారత కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ:గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన 21 మందికి అవార్డులను ప్రకటించింది. వీరిలో పంజాబ్‌కి చెందిన సామాజిక కార్యకర్త జగదీష్ లాల్ అహుజా,జమ్మూకశ్మీర్‌కి చెందిన సామాజిక కార్యకర్త జావేద్ అహ్మద్(దివ్యాంగుల సంక్షేమం),కర్ణాటకకు చెందిన సామాజిక కార్యకర్త తులసిగౌడ(పర్యావరణం), అరుణాచల్‌ప్రదేశ్‌కి చెందిన సామాజిక కార్యకర్త సత్యనారాయణ్(తక్కువ ఫీజుతో విద్యా బోధన),మధ్యప్రదేశ్‌కి చెందిన అబ్దుల్ జబ్బార్(భోపాల్ గ్యాస్ బాధితుల పోరాట కార్యకర్త),ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఉషా చమర్(శానిటేషన్),మహారాష్ట్రకు చెందిన పోపట్ రావ్ పవార్(నీటి పారుదల),కర్ణాటకకు చెందిన హరేకాల హజబ్బా(వ్యవసాయం)లకు అవార్డులు దక్కాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com