పద్మ అవార్డ్స్ 2020 : పీవీ సింధుకు పద్మభూషణ్..
- January 25, 2020
కేంద్ర ప్రభుత్వం 2020 ఏడాదికిగానూ పద్మ అవార్డులను ప్రకటించింది. క్రీడారంగంలో ప్రతిభ చూపినందుకు స్టార్ షట్లర్ పీవీ సింధును పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. సింధు సహా మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి పద్మ పురస్కారాలు వచ్చాయి. తెలంగాణ నుంచి చింతల వెంకట్ రెడ్డి, శ్రీభాశ్యం విజయసారథి.. ఆంధ్రప్రదేశ్ నుంచి యడ్ల గోపాలరావు, దలవాయి చలపాతి రావు పద్మ శ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.
మొత్తంగా 141 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది.
ఏడుగురిని పద్మ విభూషణ్, పదహారు మందిని పద్మ భూషణ్ అవార్డులకు ఎంపిక చేసింది.
కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ జైట్లీ, జార్జ్ ఫెర్నాండేజ్, సుష్మస్వరాజ్‌లతోపాటు కర్ణాటకకు చెందిన విశ్వేశ తీర్థ స్వామీజీకి మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి. వీరితో పాటు మేరీ కోమ్, చెన్నూ లాల్ మిశ్ర, అనిరుధ్ జుగ్నౌద్ కూడా పద్మ విభూషణ్ దక్కినవారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!







