తెలుగు రాష్ట్రాల్లో భూకంపం..
- January 26, 2020
తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి భూకంపం వచ్చింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బసవాపురం, పాతర్లపాడు.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో అచ్చంపేట, తాళ్లచెరువు, కొత్తపల్లి గ్రామాలలో.. కృష్ణాజిల్లాలోని చందర్లపాడు, కంచికచెర్ల, వీరులపాడు, జగ్గయ్యపేట.. నందిగామ మండలాల్లో అర్ధరాత్రి 2.37 గంటల సమయంలో భూమి 10 సెకెన్ల పాటు భూమి కంపించింది.
ఇక దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైంది. ఇంట్లోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో ప్రజలు భయాందోళనలతో బయటికి పరుగులు తీశారు. అయితే ఇవి చిన్న ప్రకంపనలేనని… వీటి వల్ల భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కాగా, ఐదేళ్ల కిందట రిపబ్లిక్ డే రోజున ఇలాగే ఖమ్మంలోని పాతర్లపాడు, నాగులవంచ గ్రామాల్లో భూమి కంపించింది అక్కడి గ్రామస్థులు చెప్పడం గమనార్హం.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు