ప్రపంచ దేశాలను బెంబేలేత్తిస్తున్న కరోనా వైరస్
- January 26, 2020
కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తోంది. చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 41కి చేరింది. హాంకాంగ్ లో అధికారులు అత్యున్నత స్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఫిబ్రవరి 9న జరగాల్సిన స్టాండర్డ్ చార్టర్డ్ హాంకాంగ్ మారథాన్ ను వాయిదా వేశారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా:
కరోనా వైరస్.. ఇదో ప్రాణాంతక వైరస్.. దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాల్లో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఏ క్షణంలో ఈ వైరస్ ఎటాక్ చేస్తుందోనన్న భయం బెంబేలిత్తిస్తోంది. డేంజరస్ వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. పొరుగు దేశం చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ కరోనా వైరస్ వందల మందికి సోకింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 41మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది.
చైనాలో పుట్టి.. సౌదీ వరకు పాకింది:
చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తూ థాయ్ లాండ్, జపాన్, దక్షిణ కొరియా, సౌదీ వరకు పాకింది. అసలు ఈ వైరస్ ఎలా పుట్టింది? ఏ జంతువు నుంచి మనుషుల్లో సంక్రమించింది అనేది అంతు చిక్కడం లేదు. కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది అనేదానిపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్.. పాములు నుంచే సంక్రమించిందంటూ కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
కరోనా వైరస్ మూలం ఏంటి?:
కరోనా వైరస్‌కు సంబంధించిన కొన్ని కీలక విషయాలను పరిశీలిస్తే.. కరోనా వైరస్ పుట్టుక పాముల నుంచే సంక్రమించింది అనడానికి ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి. అయితే, పాములకు మనుషులకు సంబంధమేంటి? పాముల నుంచి మనుషులకు ఎలా ఈ వైరస్ సంక్రమించిందంటే.. చైనాలోని వుహాన్ సిటీలో ఎక్కువగా పాములను ఆహారంగా తింటుంటారు. అక్కడి మార్కెట్లలో చేపలు, పందులు, గాడిద మాంసంతో పాటు పాముల మాంసం కూడా అమ్ముతుంటారు.
ఆ పాముల మాంసం తినడం ద్వారా వాటిలోని వైరస్ మనుషుల్లోకి సంక్రమించినట్టు ఇప్పటికే చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సెంటర్ తమ అధ్యయనంలో వెల్లడించింది. గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్ జీన్స్ కాంబినేషన్‌తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని సైంటిస్టులు తేల్చారు. పాముల్లోని జీన్స్‌తోనూ వాటిని పోల్చి చూడగా, ఒకేలా ఉన్నట్టు గుర్తించారు. మనుషుల్లో సంక్రమణకు ముందుగా పాముల్లోనే ఈ వైరస్ ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..