యూఏఈ:ఇక ఇంటి నుంచే పోలీస్ కంప్లైట్ ఫైల్ చేసే ఆప్షన్..
- January 26, 2020
యూఏఈ:ప్రజలకు పోలీసు సేవలు మరింత తొందరగా, ఈజీగా అందుబాటులోకి తెచ్చేలా అబుదాబి పోలీసులు చర్యలు చేపట్టారు. 'వీ కేర్ ఫర్ యు' అనే స్లోగన్ తో కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముందుగా టోల్ ఫ్రీ నెంబర్ 999కి ఫోన్ చేసి ఆ తర్వాత స్మార్ట్ డివైస్ నుంచి నేరుగా కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు. అబుదాబి పోలీస్ డైరెక్టర్ జనరల్ అలీ అల్ షరీఫి సర్వీస్ ను కంప్లైంట్ ఫ్రమ్ హోమ్ సర్వీసును లాంచ్ చేశారు. ప్రజల సంరక్షణలో పోలీసుల లీడర్ షిప్ కు ప్రస్తుత ఆప్షన్ ప్రేరణగా ఉంటుందని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రయాస నుంచి తప్పించటం కంప్లైంట్ ఫ్రమ్ హోమ్ సర్వీస్ లక్ష్యమని అబుదాబి పోలీసులు చెబుతున్నారు. ఫిర్యాదుదారులు సత్వరమే ఫిర్యాదు చేసే అవకాశంతో పాటు వారి సాటిఫాక్షన్ పెంచటంలో కొత్త విధానం ఉపకరిస్తుందని అన్నారు. 999కి కాల్ చేయటం ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ కి సమాచారం అందించిన వెంటనే పాట్రోలింగ్ పోలీసులు వెంటనే లోకేషన్ చేరుకుంటారని..అక్కడే స్మార్ట్ డివైస్ లో కంప్లైంట్ ఫైల్ చేయవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







