రిపబ్లిక్ డే వేడుకలు.. అసోంలో వరుస పేలుళ్లు.. పుల్వామా సూత్రధారి హతం
- January 26, 2020
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న వేళ అసోంలోని డిబ్రూగర్ జిల్లాలో వరుస పేలుళ్లు సంభవించాయి. జిల్లాలోని గ్రాహం బజార్లో తొలి పేలుడు సంభవించింది. ఆ తర్వాత గురుద్వారా వద్ద మరో పేలుడు
జరిగిందని ఏఎన్ఐ తెలిపింది.
ఎవ్వరూ ఊహించని విధంగా వరుస పేలుళ్లు చేటుచేసుకోవడంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగ మరింత అప్రమత్తమైంది, ఈ ఘటనలకు బాధ్యులెవరనే దానిపై దర్యాప్తు ప్రారంభించామని రాష్ట్ర డీజీపీ భాస్కర్ జ్యోతి మెహంత్ తెలిపారు.
మరోవైపు జమ్మూ కాశ్మీర్లో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. కాశ్మీర్లో జైషే మొహమ్మద్‌కు తనను తాను చీఫ్‌గా ప్రకటించుకున్న ఖారీ యాసిర్ ఈ దాడిలో హతమయ్యాడు. మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఖారీ యాసిర్ కూడా ఉన్నాడు.
గత ఏడాది పుల్వామాలో జరిగిన దాడికి సూత్రధారి ఖారీ యాసిరే.. ఐఈడీ బాంబుల తయారీలో యాసిర్ సిద్ధహస్తుడు. ఉగ్రవాదుల నియామకాలు, పాక్‌లో శిక్షణ పొందిన వారిని సురక్షితంగా తరలించడం వంటి కార్యక్రమాల్లో ఖారీ యాసిర్ కు ప్రమేయం ఉందని లెఫ్టినెంట్ జనరల్ ధిల్లాన్ తెలియజేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







