దుబాయ్ లో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 26, 2020
దుబాయ్:దుబాయ్ లో వందలాది మంది భారతీయులు దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద జరిగిన భారత 71 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. యూఏఈలో ఇండియన్ కాన్సల్ జనరల్ విపుల్, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతీయులంతా ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాల్ని ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణ తర్వాత విపుల్, అక్కడికి చేరుకున్న భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు.దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను, వారి కుటుంబ సభ్యులను గుర్తుచేసుకున్నారు. పిల్లలు, పెద్దలు సంప్రదాయ వస్త్రధారణలో కనువిందు చేశారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు