కరోనాకు విరుగుడుగా గబ్బిలం మాంసం..దానికై పరుగులు పెడుతున్న జనం

- January 26, 2020 , by Maagulf
కరోనాకు విరుగుడుగా గబ్బిలం మాంసం..దానికై పరుగులు పెడుతున్న జనం

చైనా దేశంలో కలకలం రేపుతున్న కరోనా వైరస్ కు విరుగుడుగా గబ్బిలాన్ని తినమని చెబుతుండటం తో ఆ దేశ ప్రజలు గబ్బిలాలు తినడానికి పరుగులెత్తుతున్నారు.కరోనా వైరస్ బారినపడిన అనేక మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా వేలాది మంది ఈ వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ వైరస్‌కు విరుగుడు గబ్బిలం మాంసం, గబ్బిలం ఎముకలతో చేసిన సూప్ అనే ప్రచారం సాగుతోంది. దీంతో అనేకమంది గబ్బిలంను ఆరగించేందుకు పోటీపడుతున్నారు.

ఓ యువతి రెస్టారెంట్‌లో కూర్చున్న గబ్బిలంతో చేసిన సూప్‌ను కూడా తాగేసింది. వండిన గబ్బిలాన్ని ఆమె ఎంత ఇష్టంగా తిందంటే.మాంసమే కాకుండా దాని చర్మాన్ని కూడా తీనేందుకు యత్నించింది. చర్మం తినకూడదని అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెకు చెప్పారు.

చైనాలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు బలిగొని, మరో 600 మందికి వ్యాపించింది. పాము, గబ్బిలాల నుంచే ఈ వైరస్ మనుషులకు వ్యాపించినట్టు పెకింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ చైనా యువతి ఇలా గబ్బిలాన్ని తినేసింది. ఈ వీడియోను మీరు కూడా తిలకించండి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com