ఇ-వీసా సిస్టమ్‌తో రిజిస్టర్ కావాల్సిందిగా కంపెనీలకు సూచన
- January 26, 2020
మస్కట్: కంపెనీలు అలాగే ఇన్‌స్టిట్యూషన్స్ ఇ-వీసా సిస్టమ్‌తో రిజిస్టర్ అవ్వాల్సిందిగా రాయల్ ఒమన్ పోలీస్ సూచించడం జరిగింది. ఇప్పటిదాకా అలా రిజిస్టర్ చేసుకోని కంపెనీలు, ఇన్‌స్టిట్యూషన్స్ తక్షణమే సమీపంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ అండ్ రిసెఇడెన్స్‌కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది రాయల్ ఒమన్ పోలీస్. కొత్త విధానం ద్వారా సంబంధిత ఎస్టాబ్లిష్‌మెంట్స్ తాలూకు పీఆర్వోలు లేదా ఆథరైజ్డ్ అఫీషియల్స్ వర్క్ వీసా కోసం కార్యాలయాల్ని సందర్శించాల్సిన అవసరం వుండదు. చాలా తేలిగ్గా ఈ-విధానం ద్వారా ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకోవచ్చు. కొత్త ఎలక్ట్రానిక్ వీసా విధానం, నేషనల్ ఇ-గవర్నెన్స్ పాలసీలో భాగంగా వినియోగదారులకి సమయాన్ని అలాగే శ్రమనీ తగ్గించేలా రూపొందించారు. రిజిస్టర్ చేసుకున్న సంస్థలు, వర్క్ వీసాలకోసం ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్, రెండు ఫొటోగ్రాఫ్స్, పాస్‌పోర్ట్ కాపీ, ఒరిజినల్ లేబర్ పర్మిట్ (మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ జారీ చేసింది) ఈ విధానం ద్వారా సబ్‌మిట్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







