గల్ఫ్ లో పర్యటించనున్న కేసీఆర్...NRI పాలసీ పై కసరత్తు
- January 27, 2020
తెలంగాణ:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఫిబ్రవరి 26నుంచి గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్నారు. సౌదీ, ఖతార్, దుబాయ్, కువైట్ తదితర దేశాల్లో పర్యటించనున్న కేసీఆర్.... వివిధ కారణాలతో గల్ఫ్ లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను తిరిగి స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించనున్నారు. పర్యటనకు ముందే గల్ఫ్ పాలసీ ప్రకటించనున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.... ఆయా దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలంగాణవాసులను తిరిగి వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టనుంది. జైళ్లలో మగ్గుతున్న తెలంగాణవాసులను విడిపించడానికి ఆయా దేశాధినేతలతో సంప్రదింపులు జరపనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ముందుగా మంత్రి కేటీఆర్ గల్ఫ్ వెళ్లనున్నారు. తెలంగాణవాసులను వెనక్కి తీసుకురావడానికి ఆయా దేశాల ఉన్నతాధికారులతో మాట్లాడి... గ్రౌండ్ వర్క్ పూర్తి చేయనున్నారు. అనంతరం గల్ఫ్ కంట్రీస్ లో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఆయా ప్రభుత్వాధినేతలతో...
అలాగే, భారత రాయబారులతో సమావేశమై... ప్రక్రియ ముగించనున్నారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోనే వీళ్లందరినీ స్వరాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా.... వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక్ చర్యలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







