Bharat AirFibre నెట్ వర్క్ సర్వీసు: గ్రామాల్లోకి ఇంటర్నెట్ కనెక్టవిటీ
- January 27, 2020
పట్టణాలకే పరిమితమైన ఇంటర్నెట్ కనెక్టవిటీ గ్రామాల్లోకి విస్తరిస్తోంది. పల్లెల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ప్రభుత్వ టెలికం రంగ సంస్థ BSNL గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టవిటీని అందిస్తోంది. అదే.. Bharat AirFibre నెట్ వర్క్ సర్వీసు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా BSNL ఈ కొత్త ఫైబర్ సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ సర్వీసు ద్వారా గ్రామాల్లోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సర్వీసును అందించనుంది. భారత్ ఎయిర్ ఫైబర్ అంటే.. బీఎస్ఎన్ఎల్ అందించే FTTH బ్యాండ్‌విడ్త్ సర్వీసు... వైర్డ్ ఇంటర్నెట్ టెక్నాలజీ FTTH కు దీనికి వ్యత్యాసం ఉంది.
AirFibre వైర్ లెస్ సర్వీసును కంపెనీ తీసుకొచ్చింది. 'భారత్ ఎయిర్ ఫైబర్ వైర్ లెస్ సర్వీసును ప్రారంభించాం. ఉచిత స్పెక్ట్రామ్ బ్యాండ్ తో అందిస్తున్నాం. ప్రధానంగా ఇంటర్నెట్ సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తున్నాం' అని బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ తెలిపారు.
ఎయిర్ ఫైబర్ సర్వీసును లైన్ ఆఫ్ సైట్ రేడియో వేవ్స్ ద్వారా గ్రామాలకు కాల్ సెంటర్ సర్వీసులను అందించనుంది. వైఫై రూటర్లు, మైక్రోవేవ్స్ ఒవెన్స్ లేని గ్రామాల్లో భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీసులు ఈజీగా అందించాలని కంపెనీ యోచిస్తోంది. ఎయిర్ ఫైబర్ కనెక్షన్ సాయంతో ట్రిపుల్ ప్లే సర్వీసులను BSNL అందించనుంది.
దీని ద్వారా యూజర్లు కేవలం కాలింగ్, ఇంటర్నెట్ సర్వీసులను మాత్రమే కాదు.. TV సర్వీసులను కూడా యాక్సస్ చేసుకోవచ్చు. Yupp TV భాగస్వామ్యంతో టీవీ కంటెంట్ కూడా BSNL అఫర్ చేస్తోంది. ఈ టెలికం ఆపరేటర్, తమ ఎయర్ పైబర్ సర్వీసు ద్వారా గ్రామీణ పారిశ్రామికవేత్తలను కూడా శక్తివంతం చేయాలని భావిస్తోంది. గ్రామీణ పారిశ్రామికవేత్తలు తమ గ్రామాల్లో ఎయిర్ ఫైబర్ సర్వీసు కోసం రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తోంది.
ఇందులో ఎయిర్ ఫైబర్ పరికరాల ఇన్ స్టాలేషన్ కు సబ్ స్ర్కైబర్ల నుంచి రూ. 3వేలు వరకు ఛార్జ్ చేయనుంది. బీఎస్ఎన్ఎల్ భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీసుపై ప్రారంభ ధర రూ.500 నుంచి నెలవారీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







