జయప్రద ప్రధాన పాత్రలో 'శరభ'. చిత్రం
- January 19, 2016
జయప్రద ప్రధాన పాత్రలో ఎ.కె.యస్.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'శరభ'. ఆకాష్ సహదేవ్, మిస్తి చక్రవర్తి నాయకానాయికలు. నరసింహారావు.ఎన్ దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మాత. 108 నరసింహస్వామి పుణ్యక్షేత్రాల్లో ఒకేసారి సినిమాని ప్రారంభించినట్టు చిత్రబృందం తెలిపింది.దర్శకుడు మాట్లాడుతూ ''సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఒక కాన్సెప్ట్ చిత్రమ''ని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ''నరసింహస్వామి చరిత్రలోని ఓ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. దర్శకుడు కొత్త తరహా కథ, కథనాల్ని సిద్ధం చేశాడు. శంకర్ దగ్గర 20 ఏళ్లపాటు పనిచేసిన అనుభవంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఈ నెల 21 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెడతామ''న్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







