బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్
- January 29, 2020

ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్షు నెహ్వాల్ సైతం కాషాయ కండువా కప్పుకున్నారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ బుధవారం దిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సైనా నెహ్వాల్, ఆమె అక్క చంద్రాన్షు నెహ్వాల్లకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చి, కాషాయ కండువా కప్పారు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. దేశం కోసం కష్టపడుతున్న పార్టీ బీజేపీ అని, అలాంటి పార్టీలో చేరటం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు.
తాను కష్టపడే స్వభవం గల వ్యక్తినని, కష్టపడేవాళ్లంటే తనకు ఇష్టమని.. నరేంద్ర మోదీ దేశం కోసం రాత్రి, పగలు కష్టపడుతుంటారని, ఆయనతో పాటుగా తాను కూడా దేశం కోసం కష్టపడతానని తెలిపారు.
తనకు రాజకీయం కొత్త అని, అయితే.. రాజకీయాలపైన కూడా అవగాహన తెచ్చుకోవడం, రాజకీయాలను పరిశీలించడం తనకు నచ్చుతుందని చెప్పారు.
నరేంద్ర మోదీ క్రీడల కోసం కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని, 'ఖేలో ఇండియా' ద్వారా క్రీడాకారులు పెద్దపెద్ద అకాడమీల్లో చేరే అవకాశం లభిస్తోందని వివరించారు.
దేశానికి మంచి చేస్తున్న పార్టీలో చేరటం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని, నరేంద్ర మోదీ ద్వారా తాను చాలా స్ఫూర్తి పొందుతుంటానని, ఆయనలాగే తాను కూడా దేశానికి మంచి చేయాలనుకుంటున్నానని, అందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిచ్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







