"తారా" మంత్రమే కరోనాకు విరుగుడు: దలైలామా

- January 29, 2020 , by Maagulf

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి తెలిసిందే. ఇప్పటి వరకు దీనికి విరుగుడు ఔషధాలు లేకపోవడంతో.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే చైనాలో కరోనా వైరస్ బారిన పడి 106 మంది చనిపోయారు. ఇంకా వెయ్యికి పైగా కేసులు మంగళవారం ఒక్కరోజే నమోదయ్యాయి. దీంతో చైనాలోని వుహాన్ పట్టణ వీధులన్నీ కర్ఫ్యూని తలపిస్తున్నాయి. అయితే ఈ కరోనా వైరస్ పొరుగు దేశాలపై కూడా ఎటాక్ చేస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కూడా కొన్ని కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే దీనికి సరైన మందు ఇంకా లేకపోవడంతో.. ఈ వైరస్‌ను అడ్డకోవడం ఎలా అన్నదానిపై ఆలోచనలో పడ్డారు.

అయితే ప్రముఖ బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామా ఈ కరోనా మహమ్మారికి విరుగుడు మంత్రాన్ని చెప్పారు. చైనాలోని తన అనుచరులకు.. ఈ వైరస్‌రను అరికట్టే మంత్రాన్ని పఠించాలంటూ సూచించారు. చైనాలోని కొందరు దలైలామా భక్తులు.. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సలహా ఇవ్వాలని ఫేస్‌బుక్‌ వేదికగా దలైలామాను కోరారు. దీంతో ఆయన భక్తుల ప్రశ్నలకు సమాదానం ఇస్తూ.. తారా మంత్రాన్ని పఠిస్తే ఈ వైరస్ దరిదాపుల్లోకి కూడా రాదని తెలిపారు. ఈ మంత్రం వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 'ఓం తారే తుత్తారే తురే సోహా' అంటూ పఠిస్తే కరోనా నుంచి విముక్తి లభిస్తుందని దలైలామా తన భక్తులకు సందేశాన్ని ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com