10th ఎడిషన్ ఆఫ్ షార్జా లైట్ ఫెస్టివల్ కు అంతా రెడీ..ఫిబ్రవరి 5 నుంచి స్టార్ట్

- January 29, 2020 , by Maagulf
10th ఎడిషన్ ఆఫ్ షార్జా లైట్ ఫెస్టివల్ కు అంతా రెడీ..ఫిబ్రవరి 5 నుంచి స్టార్ట్

షార్జా మోస్ట్ కలర్ ఫుల్ లైట్ ఫెస్టివల్ కు అంతా సిద్ధమైంది. ఈ సారి లైట్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ నిర్వహించబోయే లొకేషన్స్ సంఖ్యను మరింతగా పెంచుతున్నట్లు ఆర్గనైజర్లు ప్రకటించారు. సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖసిమి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ది షార్జా కామర్స్ అండ్ టూరిజమ్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు వివరించారు. లైట్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కు సంబంధించి వివరాలు వెల్లడించిన అధికారులు ఈ సందర్భంగా ప్రదర్శించిన షార్జా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ బిల్డింగ్ లో స్పెక్టాక్యులర్ మీడియా ప్రివ్యూ అందర్ని ఆకట్టుకుంది. అల్ ధైద్, ఖోర్ ఫక్కన్, దిబ్బా అల్ హిస్న్ తో సహా ఎమిరాతి పరిధిలోని 19 సైట్లలో ఈ లైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివల్ కోసం లోకల్ ఆర్టిస్ట్స్ తో ఇంటర్నేషనల్ టాలెంట్ పరన్స్ క్రియేటివిటీని వినియోగంచుకున్నారు. షార్జా యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ షార్జా స్టూడెంట్స్ కూడా ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

లైట్ ఫెస్టివల్ లో అరబ్ కల్చర్ ను చాటేలా, షార్జా సిటీ హిస్టరీ స్టోరిని వివరించేలా స్టన్నింగ్ ఇమేజెస్ ప్రదర్శించనున్నారు. ఈ ఉత్సవంలో మూడు ఇంటరాక్టివ్ షోలు ఉంటాయి, వాటిలో రెండు అల్ మజాజ్ వాటర్ ఫ్రంట్ వద్ద నిర్వహిస్తారు. మరోటి యూనివర్శిటీ సిటీ హాల్ ఫెకెడ్ దగ్గర ప్రదర్శిస్తారు. యూనివర్శిటీ సిటీ హాల్‌లో జరిగే ఇంటరాక్టివ్ షో వర్చువల్ రియాలీటీ, వీడియో మ్యాపింగ్ షో కాంబినేషన్ వరల్డ్ వైడ్ గ్రా ట్రావెల్ చేసినట్లు అనుభూతి కలిగిస్తాయి. రిమోట్ కంట్రోల్ ప్యానెల్ ద్వారా లైటింగ్ షోను ఆపరేట్ చేయవచ్చు. అయితే..విజిటర్లను కూడా రిమోట్ ఆపరేటింగ్ కి అనుమతించటం ద్వారా విలక్షణత అవకాశం ఏర్పడనుంది.

ఈ లైట్ ఫెస్టివల్ లో అల్ మజాజ్ వాటర్ ఫ్రంట్ దగ్గర నిర్వహించే మేజర్ షో ప్రతీ రోజు రాత్రి 9 గంటలకు జరగనుంది. ఈ షోలో ఇంటర్నేషనల్ టీమ్స్ పాల్గొంటాయి. ఇక మిగిలిన లోకేషన్స్ లో ప్రతీ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షోస్ ఉంటాయి. గురు, శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటల నుంచి మిడ్ నైట్ వరకు షో కొనసాగిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com