కరోనా వైరస్: ఫేస్ మాస్క్‌ల ధరలను పెంచడంపై ఫార్మసీలను హెచ్చరించిన దుబాయ్ అధికారులు

- January 30, 2020 , by Maagulf
కరోనా వైరస్: ఫేస్ మాస్క్‌ల ధరలను పెంచడంపై ఫార్మసీలను హెచ్చరించిన దుబాయ్ అధికారులు

దుబాయ్: కరోనా వైరస్..ఈ మాట వినగానే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల యూఏఈ లో ఈ వైరస్ కేసు నమోదైన విషయం తెలిసిందే. దాంతో ప్రజలు భద్రత చర్యలపై దృష్టి పెట్టారు. మాస్క్ ల కోసం ఫార్మసీల ముందు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా మాస్క్ ల ధరల్ని అమాంతం పెంచేశారు కొందరు ప్రబుద్దులు. ఇది తెలుసుకున్న దుబాయ్‌లోని ఆర్థిక శాఖ (డిఇడి), వెనువెంటనే అన్ని ఫార్మసీలను మరియు రిటైల్ అవుట్‌లెట్లను మాస్క్ ధరలను పెంచవద్దని ఆర్దార్లు జారీ చేసింది. 

కరోనావైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా ప్రజలు అదనపు జాగ్రత్తలు తీసుకోవడంతో అధిక డిమాండ్ ఉన్నప్పుడు ధరలను పెంచడం చట్టవిరుద్ధమని ఆ విభాగం తెలిపింది. ఏదైన ఫార్మసీ/ఔట్లెట్ ఇలా అధిక మొత్తం వసూలుచేస్తుంటే, నియోగదారులు వెంటనే DED కు నివేదించాలని కోరింది. 

ప్రజలందరూ మాస్క్ లను కొనటంతో ఫార్మసీల్లో మాస్క్ ల కొరత ఏర్పడిందనీ, ముఖ్యంగా కరోనావైరస్ వేగవంతంగా వ్యాప్తి చెందే స్వభావం కారణంగా, దాని వ్యాప్తిని తగ్గించడానికి మద్దతు ఇవ్వగలదని వైద్యపరంగా నిరూపించబడిన N95 మాస్క్ లకు విపరీతమైన డిమాండ్ ఉంది..కావున వాటిని సరఫరా చేసేందుకు మా బృందం సమాయత్తమైందని ఆస్టర్ ప్రైమరీ కేర్ సిఇఒ అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com