హోటల్‌ గెస్ట్‌ని కోర్టుకీడ్చిన వాటర్‌ బాటిల్‌ గొడవ

- January 30, 2020 , by Maagulf
హోటల్‌ గెస్ట్‌ని కోర్టుకీడ్చిన వాటర్‌ బాటిల్‌ గొడవ

యూఏఈలో ఓ గల్ఫ్‌ సిటిజన్‌ వాటర్‌ బాటిల్‌ గొడవ కారణంగా కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే, గల్ఫ్‌ సిటిజన్‌ ఒకరు, ఓ హోటల్‌లో ఆసియాకి చెందిన రిసెప్షనిస్ట్‌తో వాటర్‌ బాటిల్‌ కోసం గొడవ పడ్డాడు. హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్న గల్ఫ్‌ సిటిజన్‌, మందులు వేసుకోవడం కోసం వాటర్‌ బాటిల్‌ కావాలంటూ రిసెప్షనిస్ట్‌కి ఫోన్‌ చేస్తే, సదరు రిసెప్షనిస్ట్‌ స్పందించలేదు. దాంతో, విషయం తెలుసుకునేందుకు రిసెప్షనిస్ట్‌ వద్దకు గల్ఫ్‌ సిటిజన్‌ వెళ్ళారు. వరుసగా ఫోన్‌ కాల్స్‌ అటెండ్‌ చేయాల్సి వచ్చినందున వాటర్‌ బాటిల్‌ పంపించలేకపోయినట్లు రిసెప్షనిస్ట్‌ చెబితే, ఆ సమాధానం గల్ఫ్‌ సిటిజన్‌కి నచ్చలేదు. హోటల్‌ మేనేజర్‌తో మాట్లాడతానని గల్ఫ్‌ సిటిజన్‌ కోరగా, ఆ అభ్యర్థనని కూడా రిసెప్షనిస్ట్‌ పట్టించుకోలేదట. దాంతో, రిసెప్షనిస్ట్‌ చొక్కా పట్టుకున్నారు గల్ఫ్‌ సిటిజన్‌. దాంతో, గల్ఫ్‌ సిటిజన్‌పై కేసు నమోదయ్యింది. తాను రిసెప్షనిస్ట్‌పై దాడి చేయలేదని గల్ఫ్‌ సిటిజన్‌ కోర్టులో తన వాదనను విన్పించారు. ఈ కేసు విచారణ వాయిదా పడింది.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com