కార్‌ బుక్‌ కింది భాగాన్ని తొలగించవద్దు: మినిస్ట్రీ సూచన

- January 30, 2020 , by Maagulf
కార్‌ బుక్‌ కింది భాగాన్ని తొలగించవద్దు: మినిస్ట్రీ సూచన

కువైట్‌: కార్‌ ఓనర్లు, తమకారు లైసెన్స్‌ బుక్‌ (నోట్‌బుక్‌) కింది భాగంలో వున్న వైట్‌ పార్ట్‌ని తొలగించడం తరచుగా జరుగుతుంటుంది. అయితే, ఇకపై అలా తొలగించవద్దని మినిస్ట్రీ సూచిస్తోంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్‌ సెక్టార్స్‌, సర్వీస్‌ సెంటర్స్‌ని ఈ మేరకు అలర్ట్‌ చేసింది. ఫిబ్రవరి 2 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఈ వైట్‌ పార్ట్‌ మీద కారుకి సంబంధించి ఇంపార్టెంట్‌ డేటా వుంటుంది. కారు ఓనర్‌ అలాగే పాత ఇన్స్యూరెన్స్‌ డేటాని ఇందులో పొందుపర్చుతారు. ఫిబ్రవరి నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తుందనీ, వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కొత్త ఎడిషన్స్‌ వుంటాయని మినిస్ట్రీ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com