ప్రపంచవ్యాప్తంగా ఉచిత వాట్సాప్
- January 19, 2016
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ఇక ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా వాడుకోవచ్చు. ఏడాదికి వసూలు చేస్తున్న ఒక డాలరు ఫీజును రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ సోమవారం తన వెబ్సైట్లో తెలిపింది. ఆదాయం కోసం థర్డ్ పార్టీల నుంచి ప్రకటనలను కూడా ప్రవేశపెట్టబోమని పేర్కొంది.వాట్సాప్‌ను వాడుకున్న తొలి ఏడాది తర్వాత ఫీజు చెల్లించాలని కొంతమంది యూజర్లను అడుగుతున్నామని, అయితే తాము విస్తరించడంతో, అది అమల్లో సాధ్యం కావడం లేదని తేలినట్లు వెల్లడించింది. తమ యాప్‌కు సంబంధించిన వివిధ వెర్షన్లపై ఫీజును రానున్న వారాల్లో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది యూజర్లు ఉన్న వాట్సాప్ భారత్‌లోని యూజర్ల నుంచి ఫీజు వసూలు చేయడం లేదు.కాగా, ప్రకటనల్లేకుండా తమ సర్వీసు అందించేందుకు కొన్ని టూల్స్‌ను పరీక్షిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తమ యాప్ ద్వారా యూజర్లు వ్యాపారులతో, బ్యాంకులు తదితర సంస్థలతో సంప్రదింపులు నెరపడానికి టూల్స్‌ను ఈ ఏడాది నుంచి పరీక్షిస్తామని పేర్కొంది.
తాజా వార్తలు
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం







