రేపే నిర్మలమ్మ బడ్జెట్

- January 31, 2020 , by Maagulf
రేపే నిర్మలమ్మ బడ్జెట్

న్యూ ఢిల్లీ:కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 (శనివారం) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. 2019లో అద్భుత మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఇది తొలి పూర్తి బడ్జెట్. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రవేశ పెడుతున్న ఈ బడ్జెట్ వైపు అన్ని రంగాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.

బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు రోజు ఎకనమిస్ సర్వేను ఉభయ సభల్లో సమర్పిస్తారు. ఈ రోజు (శుక్రవారం, జనవరి 31) దీనిని పార్లమెంటులో ప్రవేశ పెడతారు. జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం ఐదు శాతానికే పరిమితం అవుతుందనే అంచనాల నేపథ్యంలో.. ఆటో రంగం సహా వివిధ రంగాల్లో డిమాండ్ పడిపోయిన సమయంలో ఈ బడ్జెట్ కీలకంగా మారింది. డిమాండ్, వినియోగం పెంచేందుకు ఆదాయపు పన్ను పరిమితులు సహా వివిధ ప్రకటనలు చేస్తారని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com