విమానంలోనే కన్నుమూసిన ఏ.పి వ్యక్తి
- January 31, 2020
తిరుపతి:కువైట్ నుంచి బయలుదేరిన శ్రీనివాసులు బాలాజీ (45) విమానంలోనే గుండెపోటుతో అసువులు బాశారు. దీంతో దామినేడులో విషాదం నెలకొంది. తిరుపతి దామినేడుకు చెందిన బాలాజీ డ్రైవర్ పనిచేస్తూ ఉపాధి కోసం పదేళ్ల కిందట కువైట్ వెళ్లారు. ఈయన భార్య జయలక్ష్మి కూడా నాలుగేళ్ల క్రితం భర్త వద్దకే వెళ్లారు. తమ ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రుల వద్దే బాలాజీ ఉంచారు. తన బిడ్డలను చూడాలని బుధవారం సాయంత్రం ఆయన కువైట్ నుంచి విమానంలో చెన్నైకి బయలుదేరారు. విమానంలో ఉన్న సమయంలోనే బాలాజీకి గుండెపోటు వచ్చింది. దీంతో ఎయిర్‌హోస్టెస్‌లు ప్రథమ చికిత్స అందించారు. ఆయనకు గుండెపోటు రావడంతో సాధారణంగా గురువారం వేకువజామున 1.30 గంటలకు చెన్నై చేరుకోవాల్సిన విమానం.. ముందుగానే ల్యాండ్ అయ్యేలా ఉత్తర్వులు జారీచేయడంతో 12.50 గంటలకే వచ్చింది.
వెంటనే వైద్య బృందం బాలాజీని పరీక్షించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయానికి, దామినేడులోని మృతుడి తల్లిదండ్రులకు విమానాశ్రయ అధికారులు సమాచారమిచ్చారు. కాగా, బాలాజీని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లిన సమీప బంధువులు సుబ్రహ్మణ్యం, రాజశేఖర్.. చివరికి మృతదేహాన్ని తీసుకుని గురువారం సాయంత్రం ఇంటికి వచ్చారు. మృతుడి భార్య జయలక్ష్మి కూడా కువైట్ నుంచి బయలుదేరారు. మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుకుంటాడన్న తమ కుమారుడు శవమై తిరిగి రావడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. తమ తండ్రి నిర్జీవంగా రావడంతో కుమార్తెలు భోరున విలపిస్తున్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







